News May 2, 2024
ఓటర్లకు బెదిరింపులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు

కర్ణాటకలో కాంగ్రెస్ MLA రాజు కాగే అలియాస్ భరమ్‌గౌడ అలగౌడ కాగే ఓటర్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెళగావి జిల్లాలోని మధభావిలో పర్యటిస్తున్న సందర్భంగా.. ‘ఈసారి మాకు ఎక్కువ ఓట్లు రాకుంటే మీ కరెంట్ కనెక్షన్లు తొలగిస్తా’ అని హెచ్చరించారు. మరో సందర్భంలో ‘మోదీ చనిపోతే ప్రధాని కావడానికి 140కోట్లలో ఎవరూ లేరా’ అని నోరుజారారు. కాగా ఓటర్లను బెదిరించడంపై ఈసీ నోటీసులు జారీ చేసింది.
Similar News
News April 3, 2026
నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? జాగ్రత్తలు ఇవే

*డ్యూటీ వేళల్లో కూల్ డ్రింక్స్, టీ లాంటివి పూర్తిగా తగ్గించాలి. బ్రేక్‌లో పళ్లరసాలు తీసుకోవడం మంచిది.
*షిఫ్ట్ ముగిశాక గోరువెచ్చటి నీటితో స్నానం చేసి నిద్రపోవాలి.
*భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో పడుకోవద్దు.
*ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండేందుకు తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు తీసుకోవాలి
*యోగా, వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు.
News April 3, 2026
IPL: టాస్ గెలిచిన PBKS

చెన్నై వేదికగా CSKతో జరగనున్న మ్యాచులో PBKS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, ప్రశాంత్ వీర్, దూబే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్
PBKS: ప్రభ్‌సిమ్రన్, కూపర్, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్, చాహల్
News April 3, 2026
ఈ క్షీరదం పాలు నీటిలో కలిసిపోవు!

సముద్రపు వింతల్లో తిమింగలం పాలు ఒకటి. ఇవి ఆవు పాలలా పల్చగా ఉండవు. వెన్న మాదిరిగా గట్టిగా ఉంటాయి. ఇందులో 50% కొవ్వు ఉండటమే దీనికి కారణం. ఈ చిక్కదనం వల్ల పాలు నీటిలో కలిసిపోవు. దీనివల్ల తిమింగలం పిల్లలు నీటి అడుగున కూడా సులభంగా పాలు తాగగలుగుతాయి. ఈ అధిక కొవ్వు సముద్రపు చలిని తట్టుకోవడానికి అవసరమైన శక్తిని పిల్లలకు అందిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (37/100)


