News March 16, 2024
ఎన్నికల బరిలో ముగ్గురు అన్నదమ్ములు

వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సోదరులకు మరోసారి అవకాశం దక్కింది. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ముళ్లు వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకటరామి రెడ్డి (గుంతకల్), వై.సాయి ప్రసాద్ రెడ్డి(ఆదోని) పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వీరు అవే స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. వీరు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుమారులు.
Similar News
News April 20, 2025
‘నాలా ఎవరూ మోసపోవద్దు’ అంటూ ఆత్మహత్య

AP: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి(మ) పైడేటికి చెందిన జయ చంద్ర కొన్నేళ్లుగా ఆన్లైన్ గేమ్స్కు బానిసై అప్పులపాలయ్యాడు. ఆ బాధను తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు. వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు. నాలాగా మోసపోవద్దు’ అని షర్టుపై రాసుకొని మరీ సూసైడ్ చేసుకున్నాడు. జయ చంద్ర డిగ్రీ చదివి, వ్యవసాయం, పాల వ్యాపారం చేస్తున్నాడు.
News April 20, 2025
జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

TG: జపాన్ పర్యటనలో భాగంగా పలు సంస్థలతో CM రేవంత్ బృందం పలు ఒప్పందాలు చేసుకుంది. HYDలో ఎకో టౌన్ ఏర్పాటులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో MOU చేసుకుంది. వీటితో HYDలో భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని CM విశ్వాసం వ్యక్తపరిచారు.
News April 20, 2025
విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్లు: కేశినేని చిన్ని

AP: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ మూలపాడులో జర్నలిస్టుల క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు జై షా అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.