News December 11, 2024

స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

image

క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు మూడు రోజులు సెలవులు ఇస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే నేపథ్యంలో సెలవులుగా పేర్కొంది. గతంలో క్రిస్మస్‌కు 5 రోజులు సెలవులు ఇవ్వగా ఈసారి ప్రభుత్వం 3 రోజులకు కుదించింది. మరోవైపు ఏపీలో 24, 26న ఆప్షనల్ హాలిడే, 25న జనరల్ హాలిడే ఉండనుంది.

Similar News

News September 21, 2025

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి

image

TG: రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని Dy.CM భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మహిళలంతా ఆర్థికంగా, శక్తిమంతులుగా ఎదగాలి’ అని అన్నారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ‌పై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.

News September 21, 2025

BREAKING: టాస్ గెలిచిన భారత్

image

ASIA CUP: సూపర్-4లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బుమ్రా, వరుణ్ రీఎంట్రీ ఇచ్చారు.
భారత్: అభిషేక్, గిల్, సూర్య కుమార్(C), తిలక్, శాంసన్, దూబే, హార్దిక్, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాక్: ఫర్హాన్, అయుబ్, మహ్మద్ హారిస్, జమాన్, సల్మాన్(C), హుస్సేన్, మహ్మద్ నవాజ్, అష్రఫ్, షాహిన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, హారిస్ రవూఫ్

News September 21, 2025

కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 2గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది?