News September 21, 2024
26న జనసేనలోకి ముగ్గురు YCP మాజీ MLAలు

AP: ఈ నెల 26న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య తమ పార్టీలో చేరుతున్నట్లు జనసేన ప్రకటించింది. వీరితోపాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్, రత్నభారతి కూడా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ట్వీట్ చేసింది.
Similar News
News November 26, 2025
ఏలూరు: రాజ్యాంగ పీఠికపై ప్రమాణం

ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి మాట్లాడుతూ.. జాతీయ న్యాయదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటామన్నారు. భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 26, 2025
రాజ్యాంగ రూపకల్పనలో అతివలు

భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. దీంట్లో గౌరీ భంజా చోళ కాంస్య నటరాజ విగ్రహ రూపాన్ని రాజ్యాంగంలో చిత్రీకరించారు. అలాగే జమునా సేన్, నిబేదిత బోస్, అమలా సర్కార్, బాని పటేల్ కూడా రాజ్యాంగంలోని పలు ఇల్యుస్ట్రేషన్లు చిత్రీకరించారు.


