News April 25, 2024

శాసన సభలో ‘మూడు తరాలు’

image

AP ఎన్నికల చరిత్రలో రెండు కుటుంబాలకు చెందిన 3 తరాల వ్యక్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా 1955లో పర్వత గుర్రాజు, 1994లో ఆయన కుమారుడు పర్వత సుబ్బారావు, 1999లో గుర్రాజు కోడలు బాపనమ్మ, 2009లో మనవడు సత్యనారాయణ మూర్తి గెలిచారు. పెందుర్తి నుంచి 1978లో గుడివాడ అప్పన్న, 1989లో ఆయన కుమారుడు గురునాథరావు, 2019లో అనకాపల్లి నుంచి మనవడు అమర్‌నాథ్ విజయం సాధించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News January 27, 2026

‘యానిమల్’ సీక్వెల్‌పై రణ్‌బీర్ క్రేజీ అప్‌డేట్

image

యానిమల్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు రణ్‌బీర్ కపూర్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వేరే సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు గుర్తుచేశారు. పైగా ఆయన దీన్ని 3 పార్ట్‌లుగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీక్వెల్‌లో తాను డ్యుయల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని చెప్పారు.

News January 27, 2026

భారత్-EU ఒప్పందాలపై ప్రధాని ట్వీట్

image

ఇండియా- యురోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా పెట్టుబడులు & ఉపాధికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ భాగస్వామ్యం ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక అడుగుతో IND-యూరప్ మధ్య సహకారం మరింత పెరగనుంది.

News January 27, 2026

భారత్ భారీ స్కోర్

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 352-8 స్కోర్ చేసింది. విహాన్ సెంచరీ(109*) బాదగా, అభిజ్ఞాన్ కుందు 61, వైభవ్ సూర్యవంశీ 52, ఆరోన్ 23, కెప్టెన్ ఆయుష్ మాత్రే(21), అంబ్రిష్ 21, ఖిలాన్ పటేల్ 30 రన్స్ చేశారు. కాగా గ్రూప్ స్టేజీలో హ్యాట్రిక్ విజయాలతో యంగ్ ఇండియా జోరుమీదున్న విషయం తెలిసిందే.