News March 12, 2025
త్రిభాషా విధానం సరైనదే: సుధామూర్తి

విద్యార్థులు ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల అధిక ప్రయోజనం పొందుతారని ఎంపీ సుధామూర్తి అన్నారు. తనకు వ్యక్తిగతంగా 8 భాషలు వచ్చని నేర్చుకోవటమంటే ఎంతో ఇష్టమన్నారు. త్రిభాషా విధానం సరైనదే అని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎంపీ చిదంబరం హిందీని విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని కేంద్రం విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. NEPపై తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 13, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in
News March 13, 2026
ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.
News March 13, 2026
అబ్రార్‌ది యునిక్ బౌలింగ్.. అందుకే తీసుకున్నాం: SRH హెడ్ కోచ్

The Hundred(ఇంగ్లండ్) టోర్నీ కోసం పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను తీసుకోవడంపై SRH హెడ్ కోచ్ వెటోరీ స్పందించారు. ‘అతనిది యునిక్ బౌలింగ్. ఎన్నో వేరియేషన్స్‌తో బౌలింగ్ చేస్తారు. ఇలాంటి ప్లేయర్లను గతంలో చూసి ఉండరు. టోర్నీకి అందుబాటులో ఉంటాడనే వేలంలో కొనుగోలు చేశాం’ అని పేర్కొన్నారు. కాగా పాక్ ఆటగాడిని సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై వస్తున్న <<19368622>>తీవ్ర విమర్శలపై<<>> ఓనర్ కావ్యా మారన్ స్పందించలేదు.


