News July 2, 2024
జింబాబ్వేతో తొలి 2 టీ20లకు ముగ్గురు ప్లేయర్ల మార్పు
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు మరో ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా తొలి రెండు టీ20లకు భారత <<13502519>>జట్టు<<>>తో చేరుతారని పేర్కొంది. సంజూ, దూబే, జైస్వాల్ స్థానంలో ఈ ముగ్గురు అందుబాటులో ఉంటారని తెలిపింది. టీ20WC గెలిచిన జట్టులో దూబే, జైస్వాల్, సంజూ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోచ్ లక్ష్మణ్‌తో పాటు కొందరు ఆటగాళ్లు జింబాబ్వేకు బయలుదేరారు.
Similar News
News January 16, 2025
నిద్రలో వచ్చే కలల గురించి కొన్ని నిజాలు
ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు రావడం సహజం. అవి ఎందుకు వస్తాయో కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కలల గురించి కొన్ని నిజాలు..
✒ ప్రతి నిద్రలో 3-6 కలలు వస్తాయి.
✒ ఒక్కో కల 5- 20ని.లు ఉంటుంది.
✒ నిద్రలేచే సరికి 95% కలలు గుర్తుండవు.
✒ మనకు తీరని కోరికలే కలలుగా వస్తాయి.
✒ కలల వల్ల మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
✒ ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల అంధులకు కలలు ఎక్కువగా వస్తాయి.
News January 16, 2025
ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తెర
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపనకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఖతర్ మధ్యవర్తిత్వంతో బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందానికి వచ్చాయి. యుద్ధం ముగింపునకు అమెరికా, ఈజిప్ట్ కూడా తీవ్రంగా కృషి చేశాయి. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో యుద్ధం మొదలైంది.
News January 16, 2025
నిరాధార ప్రచారం నమ్మొద్దు: బుమ్రా
తనకు గాయమైందని జరుగుతున్న ప్రచారంపై స్టార్ బౌలర్ బుమ్రా క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, అదంతా నిరాధార ప్రచారమని ట్వీట్ చేశారు. ఇలాంటివి నవ్వు తెప్పిస్తాయన్నారు. BGTలో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అతడు అర్ధంతరంగా మైదానాన్ని వీడారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఆయనకు విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేదని CTకి దూరమవుతారని ప్రచారం జరిగింది.