News August 28, 2024
ట్రక్కు లోయలో పడి ముగ్గురు సైనికులు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిని హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముకేశ్ కుమార్, గ్రెనేడియర్ అశిశ్‌గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు భారత సైన్యం అండగా ఉంటుందని ఈస్టర్న్ కమాండ్ Xలో పోస్ట్ చేసింది.
Similar News
News April 4, 2026
కర్నూలు: హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం కె.సింగవరానికి చెందిన బోయ మల్లికార్జున <<19561311>>హత్య<<>> కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ తబ్రేజ్ బృందం కోడుమూరులోని పత్తికొండ రోడ్డులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా నిందితులకు ఈనెల 17 వరకు రిమాండ్ విధించినట్లు SI వేణుగోపాల్ రాజు తెలిపారు.
News April 4, 2026
రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే..

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్‌లో గంటల కొద్దీ శ్రమించాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 నిమిషాల పాటు సరైన వ్యాయామాలు చేస్తే చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా 2 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. తర్వాత నిమిషం పాటు కపాలభాతి చేస్తే బాడీ డిటాక్స్ అవుతుంది. చివరగా భుజంగాసనం, పవనముక్తాసనం వేస్తే లివర్‌కు రక్తప్రసరణ పెరిగి మెటబాలిజం సెట్ అవుతుంది.
News April 4, 2026
మామిడి, అరటి సాగుకు అనువైన నేలలు

మామిడి సాగుకు అన్ని నేలలూ అనుకూలం. కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం దిగుబడి ఉంటుంది. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిల్వ ఉండే నల్ల రేగడి నేలల్లో నాటకూడదు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్య ఉండాలి. అరటి సాగుకు సారవంతమైన, నీటి వసతి, నీరు ఇంకే గుణం, తగినంత సేంద్రీయ పదార్థాల గల నేలలు మిక్కిలి అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు శ్రేష్ఠం. ఉదజని సూచిక 6.5-7.5 మధ్య ఉండాలి.


