News June 26, 2024

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

image

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. డోడా జిల్లాలో ముష్కరుల కదలికలపై సమాచారం రావడంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టాయి. ఈక్రమంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోనూ ఏరివేత ముమ్మరంగా సాగుతున్నట్లు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కదలికలు పెరిగినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Similar News

News September 17, 2025

వేగంలో రారాజు.. మెట్లు ఎక్కడానికి ఆయాస పడుతున్నారు!

image

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరొందిన ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు ఫిట్‌నెస్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మెట్లు ఎక్కడానికి కూడా ఆయాస పడుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకే తన శ్వాసను మెరుగుపరచుకోవడానికి మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తానని ఆయన పేర్కొన్నారు. 2017లో రిటైర్ అయినప్పటి నుంచీ వ్యాయామం చేయకుండా సినిమాలు చూస్తూ పిల్లలతో గడుపుతున్నానని చెప్పారు.

News September 17, 2025

NVS రెడ్డి విషయంలో ప్రభుత్వం ఏమంటోంది..?

image

NVS రెడ్డిని HMRL MD పదవి నుంచి తప్పించారనే వాదనను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్‌పోర్ట్)గా ఆయన సేవలు ఎక్కువ వినియోగించుకునేలా ప్రమోట్ చేసిందని చెబుతున్నాయి. గతంలో GHMC ట్రాఫిక్ కమిషనర్ లాంటి బాధ్యతలతో పట్టణ రవాణాలో NVSకు అపార అనుభవముంది. ఫోర్త్ సిటీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆయన నైపుణ్యాలు వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాయి.

News September 17, 2025

కాలీఫ్లవర్‌లో బటనింగ్ తెగులు – నివారణ

image

కాలీఫ్లవర్‌ పంటలో చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బటనింగ్ అంటారు. ముదురు నారు నాటడం, నేలలో నత్రజని లోపం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజులు గల నారుని నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వేయాలి. స్వల్పకాలిక రకాలను సిఫారసు చేసిన సమయంలో విత్తడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.