News August 29, 2024

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదుల హ‌తం

image

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన 2 ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచిల్ సెక్టార్‌ కుంక‌డి, కర్నాహ్‌‌లో ఉగ్ర‌వాదుల చొరబాట్ల‌ స‌మాచారంతో భారత సైన్యం, JK పోలీసులు జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుధ‌వారం సాయంత్రం నుంచి గురువారం ఉద‌యం వ‌ర‌కు ఎదురు కాల్పులు కొనసాగాయి. కూంబింగ్‌లో ముగ్గురు ఉగ్రవాదుల మృత‌దేహాలను గుర్తించారు.

Similar News

News March 5, 2026

ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

image

ఇరాన్ వార్‌తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.

News March 5, 2026

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

image

<>డిజిటల్<<>> ఇండియా కార్పొరేషన్ 12 కో ఆర్డినేటర్& సెక్యూరిటీ అడ్మిన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఏ(ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), డిగ్రీ, బీఎస్సీ(CS) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://dicmedia.digitalindiacorporation.in

News March 5, 2026

ఇరాన్‌పై దాడులు.. US కాంగ్రెస్‌లో ట్రంప్‌కు ఊరట

image

ఇరాన్‌పై దాడులతో రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ కాంగ్రెస్‌లో ఊరట లభించింది. ఈ సైనిక చర్యలపై ట్రంప్ అధికారాన్ని పరిమితం చేయాలన్న తీర్మానాన్ని US సెనేట్ (ఉన్నత సభ) తిరస్కరించింది. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నుంచి ఒకరు, ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ నుంచి మరొకరు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఓటింగ్‌లో స్వల్ప తేడాతో (53-47) రిజెక్ట్ అయింది.