News May 21, 2024
ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

AP: పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం హింసను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
చుంచుపల్లి: మున్సిపాలిటీ-పంచాయతీని వేరు చేస్తున్న హైవే

చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ నెలకొన్న భౌగోళిక పరిస్థితి అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తోంది. హైవే మున్సిపాలిటీని, పంచాయతీని వేరు చేస్తోంది.
ప్రశాంతినగర్, కొత్తగూడెం మున్సిపాలిటీలను హైవే విభజిస్తోంది. హైవేకి తూర్పున ఉన్న ప్రాంతం పంచాయతీ పరిధిలోకి రాగా, పడమర ప్రాంతం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈ పంచాయతీలో 1633 మంది ఓటర్లు ఉన్నారు.
News December 13, 2025
వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.


