News July 10, 2024
దేశ చరిత్రలో SIలుగా ఒకేసారి ముగ్గురు ట్రాన్స్జెండర్లు

దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఒకేసారి SIలు అయ్యారు. బిహార్ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ట్రాన్స్మెన్(పుట్టుకలో ఆడ) కాగా ఒకరు ట్రాన్స్ఉమెన్(పుట్టుకలో మగ) ఉన్నారు. గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్ SIలు అయ్యారు.
Similar News
News December 13, 2025
వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.
News December 13, 2025
కస్టమ్స్ కమిషనర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్సైట్: taxinformation.cbic.gov.in/


