News April 8, 2025

థ్రిల్లింగ్ మ్యాచ్: KKRపై LSG విజయం

image

కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 239 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ 234 పరుగులు చేసింది. దీంతో LSG 4 పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్‌లో రహానే (61), వెంకటేశ్ (45) రాణించారు. చివర్లో రింకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

Similar News

News January 17, 2026

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

image

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.

News January 17, 2026

రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

image

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.

News January 17, 2026

WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

image

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్‌కతాలో తమ మ్యాచ్‌లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.