News March 17, 2024

థ్రిల్లింగ్: భూమి నుంచి 30KM ఎత్తులో భోజనం..

image

ఆకాశంలో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తూ భోజనం చేయడమనే ఆలోచనే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. USకు చెందిన SpaceVIP అనే ప్రైవేట్ స్పేస్ టూరిజం సంస్థ దీన్ని వచ్చే ఏడాది నిజం చేయనుంది. ప్రపంచంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ స్పేస్ కాప్సుల్ ద్వారా లక్ష అడుగుల(30KM) ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడ భోజనం చేస్తూ సన్ రైజ్‌ను చూడొచ్చు. భూమిపై ఉన్నవారితో లైవ్ వీడియో మాట్లాడొచ్చు. ఒక్కొక్కరికి ధర రూ.4 కోట్లు.

Similar News

News October 23, 2025

ఏపీలో 23 ఉద్యోగాలు

image

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 23 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. బోధన కేటగిరీలోని 10 విభాగాల్లో, బోధనేతర కేటగిరీలోని 10 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను త్వరలో https://nsktu.ac.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దరఖాస్తులకు నవంబర్ 30 ఆఖరు తేదీ.

News October 23, 2025

UCO బ్యాంక్‌లో 532 పోస్టులు

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO) 532 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.uco.bank.in/
✍️ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 23, 2025

మొక్కజొన్న కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు

image

మొక్కజొన్న కంకి మొక్కకే ఉండి త్వరగా ఎండిపోవడానికి కొందరు రైతులు వినూత్న విధానం అనుసరిస్తున్నారు. మొక్కకు కంకి ఉండగానే.. ఆ మొక్క కర్రకు ఉన్న ఆకులు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఇలా కత్తిరించిన ఆకులను పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. దీని వల్ల కంకి త్వరగా ఎండిపోవడంతో పాటు నేల కూడా త్వరగా ఆరుతోందని చెబుతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు మొక్కజొన్న రైతులు ఈ విధానం అనుసరిస్తున్నారు.