News April 13, 2025
రేపు ‘మాస్ జాతర’ నుంచి ‘తూ మేరా లవర్’ ఫుల్ సాంగ్

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ నుంచి ‘తూ మేరా లవర్’ ఫుల్ సాంగ్ రేపు విడుదల కానుంది. రేపు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భాను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తోండగా పాటలో ఇడియట్ మూవీలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ మ్యూజిక్ బీట్ను యాడ్ చేశారు. మే 9న థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది.
Similar News
News April 15, 2025
దర్శక నటుడు స్టాన్లీ కన్నుమూత

కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ‘పుదుకొట్టయిరుందు శరవణన్’, ‘ఏప్రిల్ మంత్’, ఈస్ట్కోస్ట్ రోడ్’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్లీ పలు తమిళ హిట్ సినిమాల్లోనూ నటించారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీలో ఆయన చివరిసారిగా కనిపించారు.
News April 15, 2025
టీటీడీలో 2 వేల మంది మా వాళ్లే: భూమన

AP: టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమవారేనని YCP నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని చెప్పారు. ‘గోశాలలో ఆవుల మృతిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. నేను విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. నిజమైతే టీటీడీ ఈఓ, ఛైర్మన్ను తొలగించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
News April 15, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్ని సరసన ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్గా దిశా పటానీని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.