News April 14, 2025

‘థగ్ లైఫ్’ పూర్తి.. KH237పై కమల్ ఫోకస్

image

మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’ షూటింగ్ పూర్తవడంతో మరో చిత్రంపై కమల్ హాసన్ ఫోకస్ చేశారు. అన్బు-అరీవు దర్శకత్వంలో KH237 సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, జులై/ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమల్ తన బాడీ లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 26, 2025

ఇండియాలో భద్రతపై నమ్మకముంది: ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు DECలో జరగాల్సిన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ బాంబు పేలుడే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ PMO దీనిపై స్పందించింది. ‘ఇజ్రాయెల్-ఇండియాతో పాటు ప్రధానులు నెతన్యాహు, మోదీల బంధం చాలా బలమైనది. PM మోదీ నాయకత్వంలోని భారత్‌లో భద్రతపై మా ప్రధానికి పూర్తి నమ్మకముంది. ఇప్పటికే కొత్త డేట్స్ కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని ట్వీట్ చేసింది.

News November 26, 2025

ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

image

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.