News September 3, 2025
యూరియా సమస్యను కేంద్ర మంత్రికి వివరించిన తుమ్మల

TG: రాష్ట్రంలో యూరియా సమస్య గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ‘టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు రూ.25వేల మద్దతు ధరతో పాటు వాటిపై దిగుమతి సుంకాన్ని 44% పెంచాలి. వ్యవసాయ యంత్రాలు, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై 12% GSTని మినహాయించాలి. పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమాన ధరకు అందివ్వాలి’ అని ఢిల్లీ పర్యటనలో తుమ్మల కోరారు.
Similar News
News September 5, 2025
అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్

అనుష్క ప్రధానపాత్రలో క్రిష్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఘాటీ’ ఇవాళ థియేటర్లలో రిలీజైంది. US, UK ప్రీమియర్స్ చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అనుష్క పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని పోస్టులు చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఊహించే కథ, బోర్ కొట్టే సీన్స్ ఇబ్బంది పెడతాయని అంటున్నారు.
*మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.
News September 5, 2025
రేపు KCRతో హరీశ్ భేటీ!

TG: BRS ముఖ్య నేత హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి అధినేత KCRతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో చర్చించాక కవిత ఆరోపణలపై స్పందించే ఛాన్స్ ఉంది. మరోవైపు కవిత రేపు మేధావులతో మీటింగ్‌కు సిద్ధమయ్యారు. కాగా కాళేశ్వరంలో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని, పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేశారని కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే.
News September 5, 2025
పాక్ మిలిటరీ స్టాఫ్‌తో ‘పహల్గామ్’ మాస్టర్‌మైండ్!

పహల్గామ్ టెర్రర్ అటాక్ మాస్టర్‌మైండ్, లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి తాజా ఫొటోలు SMలో హాట్ టాపిక్‌గా మారాయి. పలువురు పాక్ మిలిటరీ అధికారులతో అతడు కలిసి ఉన్న ఫొటోలు బయటికొచ్చాయి. US డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయిన సైఫుల్లా కశ్మీర్, అఫ్గానిస్థాన్‌లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తిని మిలిటరీ అధికారులు బహిరంగంగా కలవడంతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది.