News April 11, 2024

రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

image

TG: మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. ఇదిలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News January 3, 2026

దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్!

image

TG: పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. ఈ టూర్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఇది ఫిక్స్ అయితే ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్‌ తిరిగి వస్తారని సమాచారం.

News January 3, 2026

నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

image

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.

News January 3, 2026

జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

image

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.