News May 14, 2024
రేపు ఏపీలో పిడుగులతో వర్షాలు.. మండే ఎండలు

AP: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 12, మన్యంలో 10, అల్లూరి జిల్లాలోని 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అలాగే నెల్లూరు, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Similar News
News March 19, 2026
కొత్త పార్టీ.. కవితకు ఊరట

TG: పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. ఆమె కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ECకి కోర్టు సూచించింది. ఇక విచారణ సందర్భంగా EC సూచించిన లోపాలు సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సాంకేతిక తప్పులు సరిచేసి మళ్లీ దరఖాస్తు చేశామన్నారు. కాగా కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఈసీ కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే.
News March 19, 2026
మూడో బిడ్డకు జన్మనిచ్చిన దినేశ్ కార్తీక్ దంపతులు

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి ‘రాహా పల్లికల్ కార్తీక్’గా పేరు పెట్టినట్లు DK తెలిపారు. వీరికి 2021లో కవల మగ పిల్లలు కబీర్, జియాన్ జన్మించిన విషయం తెలిసిందే. కాగా కార్తీక్ 2007లో నిఖితను వివాహం చేసుకోగా 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో దీపికాను పెళ్లాడారు.
News March 19, 2026
అమెరికాలోకి డ్రోన్లు.. హై అలర్ట్‌లో వాషింగ్టన్!

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్‌నాయర్ మిలిటరీ బేస్‌పై గుర్తుతెలియని డ్రోన్లు తిరగడం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోనే US విదేశాంగ మంత్రి రూబియో, రక్షణ మంత్రి హెగ్‌సెత్ నివాసాలు ఉండటంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. గత 10 రోజులుగా ఇక్కడ డ్రోన్ల కదలికలు కనిపిస్తుండటంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ మీటింగ్స్ నిర్వహించారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.


