News May 19, 2024
రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు ఉమ్మడి చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Similar News
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
News December 5, 2025
డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.
News December 5, 2025
పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.


