News May 20, 2024

రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ సాయంత్రం వరకు శ్రీసత్యసాయి, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 30 మి.మీలకు పైగా వర్షం కురిసినట్లు వెల్లడించింది.

Similar News

News October 23, 2025

రూ.79వేల కోట్ల ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోదం

image

రూ.79వేల కోట్లతో ఆయుధాలు, పరికరాలు కొనుగోలు చేసేందుకు త్రివిధ దళాలకు ఆమోదం లభించింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించారు. ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పిడోలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్, 30MM నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, ట్రాక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

News October 23, 2025

ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

image

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్‌పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.

News October 23, 2025

కేసీఆర్‌పై MP మల్లు రవి ఆగ్రహం

image

TG: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను BRS చీఫ్ KCR <<18084451>>రౌడీ షీటర్‌<<>> అనడంపై MP మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘BC బిడ్డను రౌడీ షీటర్ అని అవమానిస్తారా? నవీన్ యాదవ్ మంచి విద్యావంతులు, పేదలకు సాయం చేసే గుణమున్నవాడు. ఆయనపై మీ అగ్రవర్ణ అహంకారాన్ని చూపిస్తారా. కేసీఆర్ బీసీలందరినీ అవమానించినట్లే. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు.