News April 15, 2025
కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

రాగల మూడు గంటలు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.
Similar News
News October 14, 2025
₹212 కోట్లతో అమరావతిలో రాజ్‌భవన్

AP: అమరావతిలో ₹212కోట్లతో రాజ్‌భవన్ నిర్మించనున్నారు. దీనికి నిధులు, పాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం GO జారీచేసింది. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌గా నిర్మించే ఇందులో గవర్నర్ మాన్షన్, దర్బార్ హాల్, ఆఫీస్, 2 గెస్ట్ హౌస్‌లు, 6 సీనియర్ స్టాఫ్, 12 జూ.స్టాఫ్, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామిడేషన్లను ఏర్పాటుచేస్తారు. కాంపౌండ్‌కు 4 వైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి.
News October 14, 2025
కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వట్లేదు: BCCI VP

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారని, ఆస్ట్రేలియా సిరీసే చివరిదని జరుగుతున్న ప్రచారాన్ని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ‘రోహిత్, కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాను ఓడించడంలో వారు కీలకం. రిటైర్మెంట్ ప్లేయర్ల ఇష్టం. కానీ ఇది వారి చివరి సిరీస్ మాత్రం కాదు. అలాంటి ఆలోచన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News October 14, 2025
TIDCOకు అప్పుగా ₹300 కోట్ల నిధులు

AP: టిడ్కో ఇళ్ల బిల్లుల చెల్లింపునకు ₹300 కోట్ల రుణం మంజూరుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రాజీవ్ స్వగృహ నుంచి ₹200 కోట్లు, APUFIDC నుంచి ₹100 కోట్లు టిడ్కోకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా టిడ్కో ఇళ్లకోసం హడ్కో ₹4450 కోట్లు మంజూరు చేసినప్పటికీ ప్రభుత్వం, లబ్ధిదారుల వాటా నిధుల ఆలస్యం వల్ల చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. ₹450 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నట్లు టిడ్కో ప్రభుత్వానికి తెలిపింది.