News April 16, 2025
నేడు పిడుగులతో కూడిన వర్షాలు

AP: నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, నిన్న రాత్రి 8 గంటల వరకు మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మి.మీ. వర్షం పడగా, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News April 16, 2025
రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా?

AP: బియ్యం పంపిణీ ఆగిపోవద్దంటే లబ్ధిదారులు రేషన్ కార్డు e-KYCని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలి. e-KYC స్టేటస్ కోసం epds1.ap.gov.in <
News April 16, 2025
అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని హామీ ఇచ్చారు. ‘ఇప్పటికే అమరావతిలో పనులు పూర్తయ్యాయి. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పరిశ్రమలు వచ్చి భూముల ధరలు పెరుగుతాయి. అందుకే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని CM భావించారు’ అని ఆయన పేర్కొన్నారు.
News April 16, 2025
సీఎంను కలిసిన 16వ ఆర్థిక సంఘం బృందం

AP: పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై సీఎం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వారికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక సాయంపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.