News August 5, 2024
మహిళ తలలో పేలు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఓ మహిళ తలలో పేలు ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కారణమయింది. జూన్ నెలలో లాస్ ఏంజెలిస్ నుంచి న్యూయార్క్ వెళుతున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికురాలి తలలో పేలు పాకుతుండటం చూసిన మహిళలు విమాన సిబ్బందికి తెలిపారు. వారు మహిళను పరిశీలించి ఫీనిక్స్‌లో ఫ్లైట్ ల్యాండ్ చేయించారు. మహిళకు అత్యవసర వైద్య సాయం అవసరం కావడంతోనే ఇలా చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Similar News
News April 9, 2026
వదినపై రూ.2 కోట్లకు దావా వేసిన హన్సిక

ఇటీవలే భర్త సోహైల్ నుంచి <<19356860>>విడాకులు<<>> తీసుకున్న నటి హన్సిక ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. తనతోపాటు కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారంటూ వదిన (అన్న భార్య) ముస్కాన్‌పై రూ.2Cr పరువు నష్టం దావా వేశారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు <<17679047>>చేయొద్దని<<>> ముంబై సెషన్స్ కోర్టు ముస్కాన్‌ను ఆదేశించింది.
News April 9, 2026
ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం.. ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ అణ్వాయుధాల తయారీ వదలడంతో పాటు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం ప్రారంభిస్తామని, గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీస్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరే వరకు అక్కడే ఉంటారని తెలిపారు.
News April 9, 2026
16న మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ: మోదీ

డీలిమిటేషన్‌కు అనుగుణంగా మహిళా రిజర్వేషన్(33%) సవరణ బిల్లుపై ఈ నెల 16న పార్లమెంటులో చర్చించి, ఆమోదించనున్నట్లు PM మోదీ ప్రకటించారు. ‘ఇది శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదు. కోట్లాది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబం. 2029 LS ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్‌తో నిర్వహించడం అత్యవసరం’ అని పేర్కొన్నారు. LS స్థానాలను 543 నుంచి 816కి పెంచి, వాటిలో 273 మహిళలకు కేటాయించడమే ఈ బిల్లు ఉద్దేశం.


