News October 10, 2025
ట్రాన్స్‌జెండర్‌కు టికెట్.. పీకే ప్లాన్ పనిచేసేనా?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. నిన్న తొలి విడతలో భాగంగా 51 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ అధికారులు & పోలీసులు సహా ట్రాన్స్‌జెండర్ సోషల్ యాక్టివిస్ట్ ప్రీతి కిన్నర్ కూడా ఉన్నారు. ‘వీరికి ఓట్లు వేయకపోతే నాకు నష్టం లేదు.. బిహార్ ప్రజలే ఆ భారం మోయాలి’ అంటూ పీకే మాటల గారడీకి తెరలేపారు.
Similar News
News October 10, 2025
213 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 213 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండి వరకు (OCT 12) అవకాశం ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు UPSC వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వీటిలో అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్, అడిషనల్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, డిప్యూటీ లీగల్ అడ్వైజర్, మెడికల్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి.
News October 10, 2025
రూ.755 ప్రీమియంతో రూ.15లక్షలు బీమా!

ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. అందుకే ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబ పెద్దకు ఏమైనా జరిగితే వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షలు, రూ.399తో రూ.10లక్షల వరకు ప్రమాద <
News October 10, 2025
నోబెల్ అందుకున్న భారతీయులు వీరే..

నోబెల్ శాంతి-2025 <<17966688>>మరియాను<<>> వరించింది. ఇప్పటివరకు నోబెల్ అందుకున్న భారతీయులు ఎవరంటే..
* ఠాగూర్-లిటరేచర్(1913), * సీవీ రామన్-ఫిజిక్స్(1930), * హరగోవింద్ ఖొరానా-ఫిజియాలజీ(1968), * మథర్ తెరెసా-శాంతి(1979), * సుబ్రమణ్యన్ చంద్రశేఖర్-ఫిజిక్స్(1983), * అమర్త్యసేన్-ఎకనామిక్ సైన్స్(1998), * వెంకట్రామన్ రామకృష్ణన్-కెమిస్ట్రీ(2009), * కైలాశ్ సత్యార్థి-శాంతి(2014), * అభిజిత్ బెనర్జీ-ఎకనామిక్ సైన్స్(2019)