News March 18, 2025
మూడు రోజుల్లోనే టికెట్ డబ్బు వాపస్: రైల్వేశాఖ

వివిధ కారణాలతో రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణికులకు మూడు రోజుల్లోగా వాపసు చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. కౌంటర్లలో తీసుకున్న టికెట్ను 3 రోజుల్లోగా ఏ రైల్వేస్టేషన్లోనైనా ఇచ్చి నగదు తీసుకోవచ్చని తెలిపింది. ఇక IRCTC యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు వాటంతటవే రద్దయి డబ్బులు ప్యాసింజర్ ఖాతాకు రీఫండ్ అవుతాయని వెల్లడించింది.
Similar News
News September 18, 2025
కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.
News September 18, 2025
రాబోయే 3 గంటల్లో వర్షం: APSDMA

రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వాన కురుస్తుందని తెలిపింది. అటు TGలో HYD, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, MBNR, NLG, కామారెడ్డి, మెదక్, NRPT జిల్లాల్లో ఇవాళ రాత్రి వర్షం పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News September 18, 2025
సర్కారు బడుల్లో నర్సరీ, LKG, UKG.. ప్రభుత్వానికి సిఫార్సు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల వయసును ఆరేళ్లకు (ప్రస్తుతం 5 ఏళ్లు) పెంచాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సర్కారు బడుల్లోనూ నర్సరీ, LKG, UKGని ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రైవేట్ పాఠశాలల్లో మూడేళ్ల నుంచే పిల్లలను చేర్చుకుంటున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ఇష్టపడటం లేదని కమిషన్ గుర్తించి ఈ సిఫార్సులు చేసింది.