News August 12, 2025

అందుబాటులోకి రాని టికెట్లు.. ఏ సినిమా కోసం వెయిటింగ్?

image

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’, రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయినా ఈ సినిమాలకు సంబంధించి టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. టికెట్ల ధరలు పెంపు, తొలి రోజు షో టైమింగ్స్‌పై స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

Similar News

News August 12, 2025

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ HYDలో 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.880 తగ్గి రూ.1,01,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.800 పతనమై రూ.92,950 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.2 వేలు తగ్గి రూ.1,25,000కు చేరింది. కాగా రెండు రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.1,640, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.1500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 12, 2025

12 ఏళ్లకు రీఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్

image

హీరోయిన్ సమీరా రెడ్డి 12 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. హారర్ మూవీ ‘చిమ్నీ’తో ఆమె అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి తన కొడుకే కారణమని తెలిపారు. ‘రేస్’ సినిమా చూసి ‘సినిమాల్లో నువ్వు ఎందుకు నటించట్లేదు’ అని తన కొడుకు అడిగిన ప్రశ్నే ఇండస్ట్రీకి తిరిగి వచ్చేలా చేసిందని పేర్కొన్నారు. ఆమె చివరగా 2013లో సినిమాల్లో నటించారు.

News August 12, 2025

కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పరారైన భర్త!

image

AP: రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు మొదటి భార్య షాకిచ్చిన ఘటన తూ.గో జిల్లాలో జరిగింది. దేవరపల్లి(M) యాదవోలుకు చెందిన పాలి సత్యనారాయణకు ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం టైంకు అతడు కనిపించకుండా పోయాడు. దీంతో వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా అప్పటికే అతడికి భార్య, కుమార్తె ఉన్నారని తెలిసింది. భార్య ఫోన్ చేసి కేసు పెడతానని బెదిరించడంతోనే అతడు ఆమెతో కలిసి పరారైనట్లు వారు ఆరోపిస్తున్నారు.