News April 3, 2025
2026 T20WC వరకు టైట్ షెడ్యూల్

ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానున్నారు. 2026 T20 WC వరకు టైట్ షెడ్యూల్ ఖరారైంది. జూన్-జులైలో ENGతో 5 టెస్టులు, SEPలో ఆసియా కప్, OCTలో వెస్టిండీస్‌తో 2 టెస్టులు, OCT-NOVలో AUSతో 3 ODI & 5 T20I, NOV-DECలో SAతో 2 Test, 3 ODI & 5 T20I, JANలో NZతో 3 ODI & 5 T20I, FEB-MARలో T20 వరల్డ్ కప్ ఆడనున్నారు.
Similar News
News April 8, 2025
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227, నిఫ్టీ 282 పాయింట్లు పొంది 22,444 వద్ద మొదలయ్యాయి. HUL, ట్రెంట్, టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం నుంచి భారత్ సహా వివిధ దేశాల స్టాక్స్ స్వల్పంగా కోలుకుంటున్నాయి.
News April 8, 2025
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ప్రీరిలీజ్‌కు NTR

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా 12వ తేదీన ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో విజయశాంతి తల్లి పాత్రలో నటిస్తున్నారు.
News April 8, 2025
అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు

AP: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో Dy.CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. స్కూలులో జరిగిన ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసి పవన్‌ను వెంటనే సింగపూర్ వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే కురిడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, ఆ తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ బదులిచ్చారు.