News March 25, 2025
మరో చోటుకు తిహార్ జైలు తరలింపు

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును ఢిల్లీ సరిహద్దుల్లోకి మార్చనున్నట్లు ఢిల్లీ CM రేఖా గుప్తా ప్రకటించారు. కొత్త జైలు నిర్మాణం కోసం సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. 400 ఎకరాల విస్తీర్ణంలో తిహార్ జైలును 1958లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 13వేల మంది ఖైదీలు ఉన్నట్లు అంచనా. తొలుత ఇది పంజాబ్ అధీనంలో ఉండగా 1966లో ఢిల్లీ ప్రభుత్వం టేకోవర్ చేసింది.
Similar News
News September 13, 2025
కోహ్లీ లేడు.. పాక్కు ఇదే మంచి సమయం: మిస్బా

ఆసియా కప్లో భాగంగా రేపు మ్యాచ్ ఆడబోయే భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్థాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ T20టోర్నీలు ఆడలేదు. టాపార్డర్ను పాక్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేరు. భారత్ను కూల్చేందుకు ఇదొక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే మాత్రం వారిని ఆపలేం’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM

AP: రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్పీలతో సమావేశమైన ఆయన.. టెక్నాలజీ సాయంతో దర్యాప్తులో అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ఆదేశించారు. వైఎస్ వివేకానంద హత్య, సింగయ్య మృతిని కేసు స్టడీలుగా చూడాలని సూచించారు.
News September 13, 2025
9 నెలల్లోపే ఆ స్థానాలకు ఉపఎన్నికలు: KTR

TG: తాము అధికారంలో ఉన్న సమయంలో గద్వాలను జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని KTR అన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 22 నెలలు గడిచినా ఏమీ చేయలేదని మండిపడ్డారు. BRSలోనే ఉన్నానని చెబుతున్న గద్వాల MLA కృష్ణమోహన్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 9 నెలల్లోపే ఫిరాయింపు స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని గద్వాల సభలో అన్నారు.