News August 23, 2025
భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. కేంద్రం క్లారిటీ

భారత్‌లో మళ్లీ<<17486073>> టిక్‌టాక్<<>> వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ‘టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా కొనసాగుతోంది. దానిని అన్‌బ్లాక్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది. భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News August 23, 2025
CHECK NOW.. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా?

AP: ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా 6.71 లక్షల మందితో కలిపి మొత్తం 1.45 కోట్ల అర్హుల కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుకు ఆమోదం వచ్చిందో లేదో ఇక్కడ <
News August 23, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 పెరిగి రూ.1,01,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,000 ఎగబాకి రూ.93,150 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 23, 2025
SBI క్రెడిట్ కార్డు హోల్డర్లకు అలర్ట్

సెప్టెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల విషయంలో మార్పులు చేస్తున్నట్లు SBI ప్రకటించింది. డిజిటల్ గేమింగ్ లావాదేవీలు, ప్రభుత్వ చెల్లింపులపై రివార్డు పాయింట్లు రావని వెల్లడించింది. లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డు, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI సెలక్ట్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డు ప్రైమ్‌లకు ఇది వర్తిస్తుంది. ఇటీవల HDFC కూడా గేమింగ్ లావాదేవీలపై రివార్డు పాయింట్లను నిలిపివేసింది.