News September 23, 2025

ఒరాకిల్ చేతికి టిక్‌టాక్

image

చైనాకు చెందిన పాపులర్ SM యాప్‌ టిక్‌టాక్‌ను USలో ఒరాకిల్ ఆపరేట్ చేయనుంది. త్వరలో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఒరాకిల్ పనిచేస్తుందన్నారు. సంస్థలోని మెజారిటీ షేర్లు అమెరికన్ ఇన్వెస్టర్ల చేతిలోకి వస్తాయన్నారు. నేషనల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కనుసన్నల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాప్‌ను కంట్రోల్ చేస్తారని పేర్కొన్నారు.

Similar News

News September 23, 2025

555 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించాలి: ఉత్తమ్

image

TG: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలోని ట్రైబ్యునల్‌ ముందు వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యధిక భూభాగంలో నది ప్రవహిస్తున్నందున 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.

News September 23, 2025

వారికీ తల్లికి వందనం నిధులు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్

image

AP: తల్లికి వందనం కింద 66,57,508 మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున సాయం అందించినట్లు మంత్రి లోకేశ్ మండలిలో తెలిపారు. ఇంకా అర్హులుంటే తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు తర్వాత, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరినవారికి వెరిఫికేషన్ అనంతరం జమ చేస్తామని చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా పథకం వర్తింపు విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News September 23, 2025

‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’తో బెండ పంటకు తీవ్ర నష్టం

image

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.