News October 5, 2024
బంగ్లాతో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్‌లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.
Similar News
News July 5, 2025
PNB కేసు.. నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)ను రూ.14వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
News July 5, 2025
రోజుకు 10 గంటలు పని చేసేందుకు అనుమతి

TG: వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం GO జారీ చేసింది. వారంలో పనివేళలు 48 గంటలకు మించరాదని <
News July 5, 2025
మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం

TG: మహిళలకు 5 వేల ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి వల్ల హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను మహిళా సంఘాలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడం కోసం RTC డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, నియామకాలూ చేపడతామన్నారు.