News January 27, 2025
తిలక్ వర్మ ఇంకా సూపర్‌స్టార్ కాదు: మాజీ క్రికెటర్
టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ స్టార్ అని కొందరు అంటున్నారని, కానీ ఆయన ఇంకా సూపర్ స్టార్ కాలేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. కానీ ఆవైపుగా ఆయన జర్నీ కొనసాగుతోందని చెప్పారు. ‘భారత్‌కు నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా తిలక్ సత్తా చాటుతున్నారు. జట్టును కష్టాల్లోనుంచి బయటపడేస్తూ సూపర్ స్టార్‌గా ఎదుగుతున్నారు. అతని నిబద్ధత, నిలకడతో రాటుదేలుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 27, 2025
నవధాన్యాలతో లోకేశ్ చిత్రం.. థాంక్స్ చెప్పిన మంత్రి
AP: లోకేశ్ చేపట్టిన యువగళం ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని తేజశ్రీ అనే ఆర్టిస్ట్ నవ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని వేశారు. ఆ యాత్ర చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా 6*4 అడుగుల చిత్రాన్ని 3 రోజుల్లో పూర్తి చేయడం గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. అద్భుతమైన కళాఖండం రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీని తయారీకి ఆమె చేసిన కృషి, చూపిన నిబద్ధతను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 27, 2025
అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దు: నాగబాబు
AP: జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నామనే అడ్వాంటేజ్ కోసం తమ పార్టీలో చేరొద్దని సూచించారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అధినేత లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.
News January 27, 2025
UGC గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం: ఉన్నత విద్యామండలి
TG: VCల నియామకంపై UGC జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. ఈ గైడ్‌లైన్స్ వల్ల వీసీల నియామకం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్‌ను నియమించాలనుకోవడం సరికాదని, ఇవి ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.