News November 20, 2024

ICC ర్యాంకింగ్స్‌లో టాప్-3కి తిలక్ వర్మ

image

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ICC T20I ర్యాంకింగ్స్‌లో రయ్యుమని దూసుకెళ్లారు. ఒకేసారి ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్3కి చేరుకున్నారు. టాప్‌1లో ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) ఉండగా 2వ స్థానంలో సాల్ట్(ఇంగ్లండ్) ఉండగా ఆ తర్వాతి స్థానాన్ని తిలక్ కైవసం చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత కేవలం 20 మ్యాచుల్లో తిలక్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. ఇటీవల SAపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొత్తం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు.

Similar News

News December 24, 2025

ALL SET: 8.54amకు నింగిలోకి..

image

AP: LVM3-M6 రాకెట్‌ ప్రయోగానికి తిరుపతి(D) శ్రీహరికోటలోని SDSC సిద్ధమైంది. 8:54amకు USకు చెందిన 6,100KGల బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి లో‌ఎర్త్ ఆర్బిట్‌(LEO)లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఇది నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.

News December 24, 2025

ధనుర్మాసం: తొమ్మిదో రోజు కీర్తన

image

గోదాదేవి సంపదలు గల కన్యను నిద్రలేపుతోంది. రత్నాల మేడలో, హంసతూలికా తల్పంపై నిద్రిస్తున్న తన మేనమామ కూతురితో ‘భగవంతుని నామాలు ఇంతలా స్మరిస్తున్నా నీకు వినబడడం లేదా? గడియ తీయవేమ్మా!’ అని అంటోంది. తన కూతురింకా లేవకపోవడంతో ‘మేనత్తా! నీవైనా లేపు. తను మూగదా? చెవిటిదా? లేక మంత్రం వేసినట్టు ఎందుకు నిద్రపోతోంది?’ అని సరదాగా నిలదీస్తుంది. భగవదనుభవం కోసం అందరూ కలిసి రావాలని ఈ పాశురం చెబుతుంది. <<-se>>#DHANRUMASAM<<>>

News December 24, 2025

ముస్లింలపై దారుణాల గురించి రాయాలని ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

image

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రొఫెసర్ అడిగిన ఓ ప్రశ్న వివాదానికి దారి తీసింది. ప్రొ.వీరేంద్ర బాలాజీ ‘INDలో ముస్లింలపై జరుగుతున్న దారుణాల గురించి రాయండి’ అని BA సెమిస్టర్ పరీక్షలో ప్రశ్న అడిగారు. ప్రశ్నాపత్రం SMలో వైరల్ కాగా ఇది రాజకీయ, మతపరమైన పక్షపాతంతో రూపొందించిన ప్రశ్న అని వర్సిటీకి ఫిర్యాదులందాయి. కమిటీని ఏర్పాటు చేసిన వర్సిటీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేసింది.