News April 13, 2025
తిలక్ ఫిఫ్టీ.. ముంబై భారీ స్కోర్

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. ఓవర్లన్నీ ఆడి 205/5 పరుగులు చేసింది. హైదరాబాదీ తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశారు. రికెల్‌టన్ (41), సూర్యకుమార్ (40), నమన్ (38) రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ ఓ వికెట్ పడగొట్టారు. ఢిల్లీ టార్గెట్ 206 పరుగులు.
Similar News
News April 15, 2025
ఢిల్లీలో ఉంటే 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే: గడ్కరీ

ఢిల్లీలో మూడు రోజులు నివసిస్తే జబ్బు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజధానిలో నెలకొన్న ఎయిర్ పొల్యూషన్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో నివసించేవారికి 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే. ఢిల్లీతోపాటు ముంబైలో కూడా ఇదే పరిస్థితి. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలి. ఇంధనాల వాడకాన్ని భారీగా తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
News April 15, 2025
మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి: భట్టి

TG: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. వారి ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్నామన్నారు. HYDలో జరుగుతున్న ‘స్త్రీ సమ్మిట్’లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఏడాదికి రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ అతివలను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు.
News April 15, 2025
ఆ భూములు మావే.. గ్రామానికి వక్ఫ్ బోర్డు నోటీసులు

TNలోని వేలూర్(D) కట్టుకొల్లాయి గ్రామస్థులకు వక్ఫ్ బోర్డు షాకిచ్చింది. 150 కుటుంబాలున్న ఆ గ్రామ భూములు దర్గాకు చెందినవని, ఖాళీ చేయాలని నోటీసులు పంపింది. ఆందోళనకు గురైన గ్రామస్థులు కలెక్టర్ వద్దకు వెళ్లి 4తరాలుగా అక్కడ జీవిస్తున్నామని, రక్షణ కల్పించాలని కోరారు. కాగా గతంలో తిరుచిరపల్లిలోని 1500 ఏళ్ల నాటి చోళా టెంపుల్‌కు సైతం వక్ఫ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.