News April 6, 2024
‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

‘టిల్లు స్క్వేర్’ సినిమా వసూళ్లు రూ.100 కోట్లకు చేరువయ్యాయి. 8 రోజుల్లో రూ.96.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మీట్కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు తెలిపింది. ఇటీవల స్టార్ బాయ్ సిద్ధూ, విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీతో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను చూసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 6, 2025
మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.
News November 6, 2025
ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.
News November 6, 2025
‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.


