News April 19, 2025
RCBకి ఆపద్బాంధవుడిలా టిమ్ డేవిడ్

IPL: టిమ్ డేవిడ్ RCBకి ఆపద్బాంధవుడిలా మారారు. ఈ సీజన్‌లో టాప్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారీ తానున్నానంటూ పరుగులు చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇవాళ PBKSపై RCB వికెట్లు టపటపా పడిపోయి 50 పరుగులైనా చేస్తుందా? అని అనుకున్న సమయంలో చక్కటి బ్యాటింగ్ చేసి ఆదుకున్నారు. కేవలం 26 బంతుల్లోనే 3సిక్సులు, 5ఫోర్లతో 50 బాదారు. చెన్నైపై(8బంతుల్లో 22), GTపై(18బంతుల్లో 32), DCపై(20 బంతుల్లో 37) రన్స్ చేశారు.
Similar News
News April 19, 2025
మరో గంటలో వర్షం

TG: పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహా నగరంలో నిన్నటి తరహాలోనే సాయంత్రం వాన పడొచ్చని అంచనా వేసింది. అలాగే మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్తే అయినా అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
News April 19, 2025
చెరకు రసాన్ని నిల్వ ఉంచి తాగుతున్నారా?

వేసవిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది చెరకు రసం తాగుతుంటారు. అయితే కొందరు చెరకు రసాన్ని నిల్వచేసి కొన్ని గంటల తర్వాత
సేవిస్తుంటారు. అలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన చెరకు రసం ఆక్సీకరణం చెందడం 15minలో మొదలవుతుంది. ఈ రసాయనిక చర్యతో 45 ని.ల్లోనే స్వచ్ఛత కోల్పోతుందని చెబుతున్నారు. ఆక్సీకరణం నెమ్మదించాలంటే చెరకు రసంలో కొంచెం నిమ్మరసం లేదా ఐస్‌ను వాడొచ్చు.
News April 19, 2025
IPL: టాస్ గెలిచిన గుజరాత్

అహ్మదాబాద్‌లో మొదలుకానున్న GTvsDC మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి.
DC: పోరెల్, కరుణ్, కేఎల్, అక్షర్, స్టబ్స్, అశుతోశ్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, ముకేశ్, మోహిత్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, షారుఖ్, తెవాటియా, రషీద్, అర్షద్, సిరాజ్, కిశోర్, ప్రసిద్ధ్, ఇషాంత్