News October 2, 2024

వడ్డీరేట్ల కోతకు టైమొచ్చింది: RBI మాజీ గవర్నర్ రంగరాజన్

image

ఇన్‌ఫ్లేషన్ స్లోడౌన్ అవ్వడంతో వడ్డీరేట్ల కోతకు టైమ్ వచ్చిందని RBI మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. రెండు దఫాల్లో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం మంచిదన్నారు. ఒకవేళ రెపోరేట్ తగ్గిస్తే మార్కెట్లను నడిపించడం కాకుండా అనుసరించడం కిందకు వస్తుందన్నారు. ఆగస్టులోనే RBI రెపోరేట్ తగ్గిస్తుందని ఎకానమిస్టులు అంచనా వేశారు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ నిలకడగా 4% లోపు ఉంటేనే ఆలోచిస్తామని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు.

Similar News

News October 2, 2024

నా డివోర్స్ వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత

image

తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ‘మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో, ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి’ అని ఓ ప్రకటనలో సూచించారు.

News October 2, 2024

‘ఆగడు’కి ముందు అనుకున్న కథ అది కాదు: శ్రీను వైట్ల

image

మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో దూకుడు వంటి హిట్ తర్వాత వచ్చిన ‘ఆగడు’ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. అయితే తాను వాస్తవంగా ఆ సినిమాకు అనుకున్న కథ వేరే అని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆగడుకి ముందు మహేశ్‌కు వేరే స్టోరీ అనుకున్నాం. మహేశ్‌కూ నచ్చింది. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా పల్లెటూరిలో జరిగే సింపుల్ కథను ఎంచుకుని సినిమాగా తీశాం. నేను ఇప్పటికీ బాధపడే నిర్ణయం అది’ అని తెలిపారు.

News October 2, 2024

గోవిందా వివరణపై పోలీసుల అసంతృప్తి!

image

అనుకోకుండా తుపాకీతో <<14239558>>కాల్చుకోవడంపై<<>> బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాను ముంబై పోలీసులు ప్రశ్నించారు. రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా మిస్ ఫైర్ అయిందని ఆయన చెప్పగా ఆ వివరణతో పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. పలు అనుమానాలు రావడంతో ఆయన కుమార్తెను సైతం విచారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.