News June 6, 2024
ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఓట్ల లెక్కింపు రెండో రౌండ్లోనూ తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో 7670 ఓట్ల ఆధిక్యం పొందిన ఆయన రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 14,672 ఓట్ల మెజార్టీ పొందారు. రెండో రౌండ్లో మల్లన్నకు 34,575 ఓట్లు రాగా, రాకేశ్ రెడ్డి(BRS)కి 27,573 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డి(BJP)కి 12,841 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అశోక్‌కు 2 రౌండ్లలో 20,037 ఓట్లే వచ్చాయి.
Similar News
News November 28, 2024
కశ్మీర్ మాదికాదు: నోరుజారి ఒప్పుకున్న పాక్ మంత్రి
ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తున్న POK ప్రజలపై పాక్ హోంమంత్రి మోహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారాయి. ‘రాజ్యాంగబద్ధంగా మీరు పాక్ పౌరులు కాదు. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటే మిమ్మల్ని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే దేశం నుంచి విడిపోయి భారత్‌తో కలుస్తామన్న POK ప్రజలకిది అస్త్రంగా మారింది. మరోవైపు POK పాక్‌ది కాదని స్వయంగా ఒప్పుకున్నట్టైంది.
News November 28, 2024
రఫాపై ఉన్న శ్రద్ధ.. బంగ్లాదేశ్‌పై ఏదీ?: పాక్ మాజీ క్రికెటర్
రఫాలో పాలస్తీనా ప్రజలపై ఉన్న శ్రద్ధ బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న హిందువులపై ఎందుకు లేదంటూ పాక్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా ట్విటర్లో ప్రశ్నించారు. ‘రఫా గురించి స్పందించారు. బంగ్లాదేశ్ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ దాడి సమయంలో ‘అందరి చూపు రఫా వైపు’ అంటూ గొంతెత్తిన సెలబ్రిటీలు బంగ్లాదేశ్ అల్లర్ల విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News November 28, 2024
6,213 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే దుస్థితి తీసుకొచ్చారు: హరీశ్ రావు
TG: రేవంత్ సర్కారు ఒక్క ఏడాదిలోనే 6,213 ప్రభుత్వ స్కూళ్లు మూత పడే దుస్థితి తీసుకొచ్చిందని హరీశ్ రావు విమర్శించారు. ప్రతీ చిన్న గ్రామానికి స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారని అన్నారు. ‘జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు విద్యార్థులున్న 4,314 స్కూళ్లను శాశ్వతంగా మూసివేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఆ స్కూళ్లలో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తోంది’ అని Xలో ఆరోపించారు.