News June 7, 2024
తొలి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,248, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వీటిలో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం దక్కింది.
Similar News
News December 2, 2025
NZB: రెండో రోజూ 1,661 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZBరూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో రెండో రోజైన సోమవారం 196 సర్పంచి స్థానాలకు 456, 1760 వార్డు స్థానాలకు 1,205 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనితో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 578, వార్డు స్థానాలకు 1,353 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వివరించారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


