News September 3, 2025

నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడికి సూచనలు

image

2 కేజీల ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మందును 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.

Similar News

News September 3, 2025

నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే: కవిత

image

TG: కేసీఆర్‌కు తాను రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావేనని కవిత ఆరోపించారు. ‘నా దగ్గర ఉన్న విషయాలన్నీ బయటపెడితే BRS నేతలంతా ఇబ్బందిపడతారు. హరీశ్, సంతోష్ అక్రమాల గురించి గతంలోనే KCRకు చెప్పా. ఇప్పటివరకు రెండు గ్యాంగులతో అంతర్గతంగా పోరాడా. ఇప్పుడు బయట నుంచి ఫైట్ చేస్తా. చెప్పాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా’ అని మీడియాతో పేర్కొన్నారు.

News September 3, 2025

కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు: మంత్రి తుమ్మల

image

కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల కొరత వచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌కి ఆస్కారం లేదు. రామగుండంలో 4 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది’ అని వివరించారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

News September 3, 2025

వంగ, బెండలో తొలి దశలో చీడపీడల నివారణ

image

వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్‌ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.