News October 7, 2025
కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
Similar News
News October 7, 2025
వాల్మీకి గురించి మనకు తెలియని మరో కథ

ఓ బోయవాడు క్రౌంచపక్షి జంటలో ఒకదాన్ని చంపడం చూసి వాల్మీకి చలించిపోతాడు. అసంకల్పితంగా ఓ శ్లోకాన్ని పలుకుతాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై.. ఆ శ్లోకమే రామాయణానికి మూలం అవుతుందని చెబుతాడు. పాత్రల సంభాషణలు, మనోగతాలు స్పష్టంగా తెలుసుకునే వరం ఇస్తాడు. ఆ వరం మేరకు వాల్మీకి ధ్యానంలో కూర్చొంటాడు. ఎలాంటి కల్పితం లేకుండా 24K శ్లోకాలతో మహాకావ్యాన్ని రచించి, లోకానికి ఆదికావ్యాన్ని అందించాడు. నేడు ఆయన జయంతి.
News October 7, 2025
PM మోదీ ఆసక్తికర పోస్ట్

తాను 2001లో ఇదే రోజు మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నేను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి తోడ్పడటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మీ మద్దతుకు కృతజ్ఞతలు’ అని తన ఫొటోలను షేర్ చేశారు.
News October 7, 2025
ప్రైవేటు ఉద్యోగులకు ‘రైట్ టు డిస్కనెక్ట్’ కావాల్సిందేనా?

గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్-2025లో 42వ స్థానంలో ఉన్న భారత్‌లో ఉద్యోగుల పని భారం చర్చనీయాంశమైంది. దీనికి పరిష్కారంగా కుటుంబంతో ఉన్నప్పుడు వర్క్ కాల్స్, మీటింగ్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండేందుకు వీలు కల్పించే ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లును కేరళ ఎమ్మెల్యే జయరాజ్ ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఇలాంటి బిల్లును తీసుకురావాలనే చర్చ జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?