News August 28, 2024

కలలు గుర్తుంచుకోవడానికి చిట్కాలు!

image

కలలు ముక్కలుగా, అస్పష్టంగా గుర్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కల మొత్తం గుర్తుండే ఛాన్స్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రపోయే ముందు 3పెద్ద గ్లాసుల నీళ్లు తాగితే రాత్రి మూడునాలుగుసార్లు మెలకువ వస్తుంది. నిద్ర సైకిల్స్ తక్కువగా ఉండటంతో ఆ గ్యాప్‌లో వచ్చిన కల గుర్తుండే ఛాన్స్ ఉందంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే కదలకుండా కాసేపు కళ్లు మూసుకున్నా కలలు గుర్తుంటాయంటున్నాయి. మీరూ ట్రై చేసి చెప్పండి.

Similar News

News January 19, 2026

చిత్తూరు: వేమనకు నివాళులర్పించిన ఎస్పీ

image

యోగి వేమన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ సోమవారం నివాళులు అర్పించారు. చిత్తూరు సాయుధ దళం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పద్యాలను రచించి, ప్రజలను మెప్పించిన మహాకవి అని కొనియాడారు. ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తి దాయకమన్నారు.

News January 19, 2026

భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

image

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.

News January 19, 2026

జియో హాట్‌స్టార్ షాక్.. పెరిగిన ప్లాన్ల ధరలు

image

జియో హాట్‌స్టార్ ప్లాన్ల ధరలను సవరించింది. జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం సూపర్, ప్రీమియం కేటగిరీల్లోని 3 నెలల, వార్షిక ప్లాన్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రీమియం వార్షిక ప్లాన్ ₹1,499 నుంచి ₹2,199కి చేరింది. మొబైల్ ప్లాన్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొత్తగా మొబైల్ ప్లాన్ ₹79, సూపర్ ₹149, ప్రీమియం ₹299 నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ పెంపు కొత్త సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.