News October 3, 2025

తిరుమల: శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వ దర్శనానికి 20గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనం కోసం బాట గంగమ్మ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,188 మంది దర్శించుకోగా.. 31,640 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.66కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిన్న ధ్వజావరోహణంతో ముగిసిన విషయం తెలిసిందే.

Similar News

News October 3, 2025

శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

image

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.

News October 3, 2025

అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. స్పందించిన సనా మిర్

image

WWCలో భాగంగా PAK, BAN మ్యాచ్ సందర్భంగా పాక్ కామెంటేటర్ సనా మిర్ చేసిన <<17897473>>అజాద్ కశ్మీర్<<>> వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. రాజకీయ కోణంలో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్లేయర్ నటాలియా పడిన కష్టాలను చెప్పే క్రమంలో ఆ పదాన్ని వాడినట్లు వివరించారు. అనుకోకుండా వాడిన పదానికి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని తెలిపారు.

News October 3, 2025

వరుస ట్వీట్లు.. అకౌంట్ క్లోజ్!

image

నిన్న Xలో వరుస <<17895726>>పోస్టులు<<>> చేసిన టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అకౌంట్ కనిపించకుండా పోయింది. KCR, KTRను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్టులపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా Xలో ఆయన అకౌంట్ కోసం వెతికితే కనిపించట్లేదు. ఈ క్రమంలో ఆయనే అకౌంట్‌ను బ్లాక్ చేశారా లేదా X ఏమైనా చర్యలు తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది.