News September 13, 2025

తిరుమల: భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 69,842 మంది స్వామివారిని దర్శించుకోగా.. 28,234 మంది తలనీలాలు సమర్పించారు.

Similar News

News September 13, 2025

ఇంటి ముందు గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలంటే?

image

ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టడానికి అమావాస్య రోజు అత్యంత అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు. ఆరోజు సూర్యోదయానికి ముందే గుమ్మడికాయకు పసుపు, కుంకుమ పూసి వేలాడదీయడం ద్వారా నరదిష్టి, కనుదిష్టి తొలగిపోతాయని అంటున్నారు. బుధవారం, శనివారం రోజున కూడా ఇదే పద్ధతిని అనుసరించవచ్చని సూచిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కట్టడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.

News September 13, 2025

పిల్లలు మట్టి తింటున్నారా?

image

పిల్లలు ఎదిగేటప్పుడు చేతికి అందిన వస్తువులన్నీ నోట్లో పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు మట్టి, సుద్ద, బొగ్గులు తింటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో పైకా అంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఐరన్​ లోపం, రక్తలేమి, ఆహారలేమి ఉన్న పిల్లలు ఇలాంటి పదార్థాలు తింటారని వెల్లడిస్తున్నారు. కాబట్టి పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News September 13, 2025

డిగ్రీ అర్హతతో 394 జాబ్స్.. ఒక్క రోజే ఛాన్స్

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ(SEP 14). డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు <>www.mha.gov.in<<>> వెబ్‌సైటును సంప్రదించగలరు.
#ShareIt