News March 11, 2025
తిరుమల: 13 కంపార్టుమెంట్లలో భక్తులు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,746 మంది దర్శించుకోగా, 23,649 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
Similar News
News March 28, 2026
పార్లమెంటులో వైసీపీ ఏం చేస్తుందో చూడాలి: లోకేశ్

AP: రాజధానిపై అసెంబ్లీ చేసిన తీర్మానం ఈ రోజే కేంద్రానికి వెళ్తుందని మంత్రి లోకేశ్ చిట్‌చాట్‌లో తెలిపారు. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలుపుతుందని, 2న పార్లమెంటులో ప్రవేశపెడతారని చెప్పారు. అసెంబ్లీకి గైర్హాజరైన వైసీపీ పార్లమెంటులో ఏం చేస్తుందో చూడాలన్నారు. జగన్ సినిమా ఏంటో గత ఎన్నికల్లో తేలిపోయిందని, ఇంకేం సినిమా చూపిస్తారని ప్రశ్నించారు.
News March 28, 2026
ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.
News March 28, 2026
ఈ లెజెండరీ IPL టీమ్‌పై మీ అభిప్రాయం?

IPL చరిత్రలోని బెస్ట్ ప్లేయర్స్‌తో కూడిన టీమ్‌ను స్పోర్ట్స్‌కీడా ఇలా సెలక్ట్ చేసింది. వార్నర్, రోహిత్ (కెప్టెన్) ఓపెనర్లుగా, కోహ్లీ, రైనా, డివిలియర్స్ మిడిల్ ఆర్డర్‌లో బలంగా నిలుస్తారు. ధోని కీపర్‌గా.. పాండ్య, జడేజా ఆల్‌రౌండర్లుగా రాణిస్తారు. బౌలింగ్‌లో సునీల్ నరైన్, బుమ్రా, మలింగ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ జట్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా మార్పులు చేస్తారా? Comment


