News February 16, 2025
తిరుమల లడ్డూ వ్యవహారం.. CBNపై సుబ్రమణియన్ విమర్శలు

తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు తీరుపై బీజేపీ నేత, ప్రముఖ లాయర్ సుబ్రమణియన్ స్వామి మరోసారి విమర్శలు గుప్పించారు. ‘లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు గత ఏడాది SEPలో అడిగింది. ఈ విషయంలో అబద్ధాలాడిన చంద్రబాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. CBN నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కుర్చీ కోసం ఆరాటమా?’ అని Xలో ప్రశ్నించారు.
Similar News
News December 5, 2025
ఇవాళ మెగా PTM

AP: ఇవాళ మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (PTM-3.0) జరగనుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలతోపాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాంను పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో టీచర్లు మాట్లాడనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలను PTMకు ఆహ్వానించారు.
News December 5, 2025
కోహ్లీ, రూట్ మధ్య సెంచరీల పోటీ!

యాషెస్‌లో తాజా టెస్టు సెంచరీతో ఈ ఫార్మాట్లో రూట్ శతకాల సంఖ్య 40కి చేరింది. కాగా రానున్న రెండేళ్లలో సచిన్ రికార్డులు బద్దలుకొట్టేందుకు కోహ్లీ, రూట్ మధ్య సెంచరీల పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. సచిన్‌కు టెస్టుల్లో 51 సెంచరీలుండగా మరో 11 చేస్తే రూట్ ఆయన సరసన నిలుస్తారు. అటు అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి 84 శతకాలు పూర్తికాగా, మరో 16 చేస్తే మాస్టర్ బ్లాస్టర్ 100 శతకాల రికార్డును చేరుకుంటారు.
News December 5, 2025
ఉప్పును చేతికి ఇవ్వకపోవడానికి శాస్త్రీయ కారణం

ఉప్పుకు తేమను పీల్చుకునే గుణం అధికంగా ఉంటుంది. ఈ కారణం చేతనే ఉప్పును నేరుగా చేతికి ఇవ్వకూడదంటారు. సాధారణంగా చేతిలో చెమట, తడి, బ్యాక్టీరియా ఉంటాయి. ఎవరైనా ఉప్పును చేతితో ఇచ్చినప్పుడు చేతిలో ఉన్న ఆ తేమ, బ్యాక్టీరియాను ఉప్పు గ్రహిస్తుంది. తేమ చేరిన ఉప్పును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఉప్పు కలుషితం కాకుండా ఉండడం కోసం పెద్దలు దానిని నేరుగా చేతికి ఇవ్వవద్దని చెబుతారు.


