News September 30, 2024
తిరుమల లడ్డూ వివాదం.. దూకుడు పెంచిన సిట్

AP: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకూ అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే TTD మాజీ పెద్దలకు నోటీసులిస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.
Similar News
News November 2, 2025
సచిన్తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ

ICC ఛైర్మన్ జైషాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. తన భార్య బ్రాహ్మణితో పాటు వెళ్లి జైషా, ఆయన తల్లి సోనాలీ షాను కలిసినట్లు ట్వీట్ చేశారు. క్రికెట్, యువత భాగస్వామ్యం, దేశ క్రీడా భవిష్యత్తు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించిన వారిద్దరూ సచిన్తో పాటు పలువురిని కలిశారు.
News November 2, 2025
FINAL: టీమ్ ఇండియాకు శుభారంభం

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి 58 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ (58*), జెమీమా రోడ్రిగ్స్ (9*) క్రీజులో ఉన్నారు.
News November 2, 2025
కార్తీకమాసంలో భక్తుల రద్దీ.. ప్రభుత్వం అలర్ట్

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది. కార్తీక మాసంలో సోమవారం, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు భక్తులకు మైకుల ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని జిల్లా ఎండోమెంట్ అధికారులను ఆదేశించింది. బారికేడ్లు పటిష్ఠంగా ఉంచాలని సూచించింది. ఒకే ప్రదేశంలో భారీ జనసమూహం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.


