News August 2, 2024
తిరుమల లడ్డూ ప్రసాదానికి 308 ఏళ్లు

AP: వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డూ. ఎవరైనా తిరుమల వెళ్లొస్తే ముందుగా అడిగేది దీనినే. ఎంతో ప్రాముఖ్యత గల లడ్డూని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి నేటికి 308 ఏళ్లు పూర్తైంది. 1715 AUG 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆలయపోటులో స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరంతో ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని తయారుచేస్తారు.
Similar News
News September 18, 2025
రాబోయే 3 గంటల్లో వర్షం: APSDMA

రాబోయే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వాన కురుస్తుందని తెలిపింది. అటు TGలో HYD, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, MBNR, NLG, కామారెడ్డి, మెదక్, NRPT జిల్లాల్లో ఇవాళ రాత్రి వర్షం పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News September 18, 2025
సర్కారు బడుల్లో నర్సరీ, LKG, UKG.. ప్రభుత్వానికి సిఫార్సు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల వయసును ఆరేళ్లకు (ప్రస్తుతం 5 ఏళ్లు) పెంచాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సర్కారు బడుల్లోనూ నర్సరీ, LKG, UKGని ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రైవేట్ పాఠశాలల్లో మూడేళ్ల నుంచే పిల్లలను చేర్చుకుంటున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ఇష్టపడటం లేదని కమిషన్ గుర్తించి ఈ సిఫార్సులు చేసింది.
News September 18, 2025
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.