News December 20, 2024
తిరుమల రూ.300 టికెట్ల బుకింగ్ తేదీల్లో మార్పు

మార్చి నెల శ్రీవాణి, రూ.300 దర్శనం టికెట్ల విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు TTD ప్రకటించింది. శ్రీవాణి టికెట్లు డిసెంబర్ 25న ఉ.11 గంటలకు, రూ.300 టికెట్లు డిసెంబర్ 26న ఉ.11 గంటలకు రిలీజ్ చేస్తామని పేర్కొంది. అదేరోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మార్పును గమనించి <
Similar News
News January 12, 2026
ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్కు రెండో విజయం.
News January 12, 2026
దేశానికి మోదీనే రక్షణ గోడ: ముకేశ్ అంబానీ

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నా PM మోదీ వల్ల ఇండియా సురక్షితంగా ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఈ సవాళ్లు భారత ప్రజలను ఇబ్బందిపెట్టలేవని, ఎందుకంటే నరేంద్ర మోదీ అనే అజేయ రక్షణ గోడ ఉందని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు చూస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో గుజరాత్లో ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
News January 12, 2026
మరోసారి పాక్ డ్రోన్ల కలకలం

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో LoC వెంబడి ఇవాళ సాయంత్రం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మరికొన్ని కనిపించినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఆయుధాలు/డ్రగ్స్ జారవిడిచారనే అనుమానంతో సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాయి. సాంబా సెక్టార్లో నిన్న డ్రోన్ ద్వారా పాక్ వెపన్స్ <<18815524>>డ్రాప్ చేయడం<<>> తెలిసిందే.


